BREAKING: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
BREAKING: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాసన మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గుత్తా పార్టీ మారబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారేది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు పదవులు ఊరికే రాలేదు గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని ఆయన సూచించారు. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్‌లో సరైన సమీక్ష జరగలేదని.. పార్టీ విధానాల్లో మార్పు రాకపోతే పార్టీకి తీవ్ర నష్టమని అన్నారు. కాగా, బీఆర్ఎస్ ఓటమిపై, కేసీఆర్ తీరుపై గుత్తా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ 6 నెలులుగా ఎవరికీ అపాయిట్మెంట్ ఇవ్వడం లేదని.. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులు అయ్యారని గుత్తా షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో సంస్థాగత మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. అధినేతతో పాటు, హైకమాండ్‌పై గుత్తా విమర్శలు చేయడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వార్తలపై పై విధంగా గుత్తా క్లారిటీ ఇచ్చారు. కాగా, నల్లగొండ బీఆర్ఎస్ ఎంటీ టికెట్ ఆశించి గుత్తా తనయుడు అమిత్ రెడ్డి భంగపడిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ను కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి ఇచ్చారు. తనయుడుకి టికెట్ దక్కపోవడంతో అప్పటి నుండి గుత్తా పార్టీ అధినాయకత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు.

Next Story

Most Viewed