- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: అబూజ్‌మడ్ అడవుల్లో కొనసాగుతున్న కూబింగ్.. మావోయిస్టులే టార్గెట్‌గా కదులుతున్న భద్రతా దళాలు

దిశ, వెబ్‌డెస్క్: దండకారణ్యాల్లో ఎక్కడో ఒకచోటు కాల్పుల మోతలు మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ అబూజ్‌మడ్ అడవుల్లో అడవుల్లో తెలుగు మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా దళాలు కాల్పులతో కూబింగ్ చేపట్టాయి. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్ , చీరాల నర్సయ్య, తిక్క సుష్మిత అనే ముగ్గురు మరణించారు. రవిపై రూ. 8 లక్షల రివార్డు, గోపన్న అలియాస్ చీమల నర్సయ్యపై రూ.25 లక్షల రివార్డ్, తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డుల ఉన్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా అబూజ్‌మడ్ అరణ్యంలో కాల్పుల మోత మోగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.