- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వర్సిటీ నియామకాల్లో చుక్కెదురు..! విద్యాశాఖ జారీ చేసి జీవోలో తప్పిదాలు

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకాలకు యూజీసీ బ్రేకులు వేసే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తున్నది. విద్యాశాఖ జారీ చేసిన జీవో.. గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. మార్పులు చేయకపోతే భవిష్యత్‌లో యూజీసీ నుంచి గ్రాంట్స్ రాకపోవచ్చనే డిస్కషన్ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్‌పై అవగాహన లేని అధికారుల పర్యవేక్షణలో జీవో తయారైందని, అందుకే తప్పుల తడకగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
స్క్రీనింగ్ కమిటీలో యూజీసీ మెంబర్ ఎక్కడ?
12 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జీవో 21ని జారీ చేసింది. నలుగురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందులో వీసీ అపాయింట్ చేసిన నామినీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నామినీ, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, డిపార్ట్‌మెంట్ హెడ్ సభ్యులుగా ఉంటారు. కాగా, ఆ కమిటీలో యూజీసీ నామినీ తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫండ్స్ రావనే చర్చ జరుగుతున్నది. వీసీల అపాయింట్‌మెంట్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసే సెర్చ్ కమిటీలోనే యూజీసీ ప్రతినిధి తప్పనిసరిగా ఉంటారు. అలాంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేసేందుకు ఏర్పాటైన కమిటీలో తమ ప్రతినిధి లేకపోతే యూజీసీ అంగీకరించదనే వాదనలున్నాయి. అందుకని సర్కారు జారీ చేసిన జీవోను సవరించాలనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. యూజీసీ రూల్స్ ఏం చెపుతున్నాయనే అంశంపై అధ్యయనం చేసిన తర్వాతే విద్యాశాఖ జీవో జారీ చేసి ఉండాల్సిందని, ఆ శాఖ బాధ్యతలు చూస్తోన్న పలువురు ఐఏఎస్‌ల హడావుడి వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి