- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
దిశ, బెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే నాయకులు పార్టీని వీడుతున్నారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులు అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలు, నేతల సహాయనిరాకరణతో అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక నేతలుగా భావించే వారు అహంకారంగా వ్యవహరించడంతో పార్టీ పూర్తిగా ప్రజలకు దూరమైందని చెప్పారు. ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్లగొండలో బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.