- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగులో అంతా 'పింకే'.. గిన్నిస్బుక్రికార్డే లక్ష్యం
దిశ, తెలంగాణ బ్యూరో : కంటి వెలుగు కార్యక్రమంలో బీఆర్ఎస్పార్టీ కలర్పింక్అధికంగా కనిపించనున్నది. అద్దాల బాక్సులు, క్యాంపు బ్యానర్లు, జిల్లాల వారీగా విడుదల చేస్తున్న బుక్లెట్లు తదితర అన్నింటినీ పింక్కలర్ లో రూపొందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జెండా కలర్‌కూడా పింక్కావడంతో ఇప్పుడు చర్చకు తెర తీసింది. పార్టీ ప్రమోషన్కోసమే కంటి వెలుగును పింక్‌మయం చేసినట్లు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో సర్కార్ముందుకు సాగుతున్నది. జనవరి18వ తేదిన స్టార్ట్కానున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కోటి 5 లక్షల మందికి స్క్రీనింగ్చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. కేవలం వంద రోజుల్లోనే అందరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి అద్దాలు పంపిణీ చేయడంతో గిన్నిస్బుక్రికార్డు ఎక్కోచ్చని సర్కార్అభిప్రాయ పడుతున్నది. అందుకే గతంలో లేనట్టుగా ఈ సారి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని కూడా పెంచారు.
ఎక్కువ మందికి మేలు...
ఈ సారి కంటి వెలుగు క్యాంపులను సర్కారీ ఆసుపత్రులలోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ పెట్టనున్నారు. దాదాపు కోటి మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వీటిలో 30 లక్షల రీడింగ్, మరో 25 లక్షల మందికి ప్రిస్కిప్షన్గ్లాస్లను ఇవ్వనున్నారు. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ స్కీమ్అందడంతో సహజంగానే పాజిటివిటీ పెరిగి, పార్టీకి మేలు చేస్తుందని బీఆర్ఎస్ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అద్దాల కొనుగోలు కూడా పూర్తయినది. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది అప్తమాలజీ డాక్టర్లు భాగస్వామ్యం కానున్నారు. ఇతర టెక్నిషియన్లు, సపోర్టెట్స్టాఫ్కూడా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులతో పాటు మెడికల్‌కాలేజీ దవాఖాన్లలో కంటి వెలుగుకు సపరేట్విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి 'కేసీఆర్కంటి వెలుగు' సెంటర్లుగా నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేసే బ్యానర్లను కూడా పింక్కలర్స్లో కొట్టిస్తున్నట్లు ఓ అధికారి ఆఫ్‌ది రికార్డులో తెలిపారు.
మొదటి విడతలో షాక్...
2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కంటి వెలుగు స్ర్కీనింగ్ తో పాటు ఆపరేషన్లనూ స్టార్ట్ చేసింది. ఆ తర్వాతి నెలలో వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఏకంగా 18 మంది చూపు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఈ ఘటనతో హుటాహుటిన ప్రభుత్వం కంటి వెలుగు ఆపరేషన్లకు బ్రేక్ వేసింది. తప్పిదాన్ని కప్పి పెట్టుకునేందుకు సదరు సర్జరీలు కంటి వెలుగు స్కీమ్‌లో చేయలేదని సర్కార్దాట వేసే ప్రయత్నం చేసింది. చివరికి బాధితులు నోరు మెదపడంతో అసలు విషయం బట్టబయలైనది. దీంతో కంటి వెలుగు ఆపరేషన్లను గతంలో పూర్తిగా నిలిపివేశారు. మొదటి విడత కంటి వెలుగులో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసిన డాక్టర్లు, 6,42,290 మందికి క్యాటరాక్ట్ (శుక్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని తేల్చారు. అయితే పట్టుమని పది వేల మందికి కూడా సర్కార్ ఆపరేషన్లు చేయించలేకపోయింది. దీంతో ఈ సారి అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read....