- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGPSC:మరో రెండు రోజుల్లో గ్రూప్-2 ఎగ్జామ్.. టీజీపీఎస్సీ కీలక అప్డేట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ నెల(డిసెంబర్) 15, 16వ తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు(Group-II Exams) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సర్వం సిద్ధం చేసింది. పరీక్షలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ హాల్‌టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకచ్చింది. TGPSC అధికారిక వెబ్‌సైట్https://www.tspsc.gov.in/ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్(HallTickets Download) చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హెల్ప్ లైన్ నంబర్లు..
గ్రూప్-2 అభ్యర్థుల(Group-II Candidates) ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్ల(Helpline numbers)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితానుhttps://www.tspsc.gov.in/ వెబ్ సైట్‌లో పొందుపర్చింది. ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షల(Group-II Exams) కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించవచ్చు. [email protected]ఈ-మెయిల్ సందేహాలు పంపవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది.