- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
దిశ, కరీంనగర్ బ్యూరో/ కరీంనగర్: కరీంనగర్ పట్టణానికి తలమానికంగా మారిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం బుధవారం సాయంత్రం అట్టహాసంగా సాగింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో కరీంనగర్ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కేబుల్ బ్రిడ్జి, రాబోయే మానేరు రివర్ ఫంట్ అందమైన ప్రకృతి దృశ్యానికి సరికొత్త వైభవాన్ని ఇవ్వబోతుందన్నారు. మానేరు రివర్ ఫంట్ పనులు ఆగస్టు వరకు పూర్తి చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా వాతావరణం అనుకులించకపోవడంతో లేజర్ షో రద్దు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
అభివృద్దిలో నెంబర్ వన్ కరీంనగర్
తెలంగాణ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లలో కరీంనగర్ పట్టణం అభివృద్దిలో నెంబర్ వన్‌గా దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ అభివృద్ది చూస్తే ప్రతిపక్ష పార్టీలకు జల్లుమంటుందని అన్నారు. రాష్ర్టం రాకపోతే కరీంనగర్ పట్టణం ఇంతగా అభివృద్ది జరిగేనా అని అన్నారు. మానేరు నది పుట్టిన చోటు నుంచి మంథని వద్ద గోదావరి నదిలో కలిసే వరకు 180కిలో మీటర్ల మేర సజల దృశ్యంగా మారనున్నట్లు మంత్రి తెలిపారు. మానేరు రివర్ ఫంట్ పనులు ఆగస్టు వరకు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.