- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవదాయశాఖ భూముల పరిరక్షణకు సర్కార్ సరికొత్త ఆలోచన.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ నియామకానికి రెడీ!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దేవదాయశాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాకూ ఒక టీంను నియమించాలని భావిస్తున్నది. అయితే కమిటీలో ఎంత మంది ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై శాఖలోని సీనియర్ అధికారులు, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడే చాన్స్ ఉన్నది.
రాష్ట్ర వ్యాప్తంగా 704 టెంపుల్స్
రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో 704 టెంపుల్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 91,827 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 25 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. మరో ఆరు వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్స్ ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు షురూ చేసింది. దేవాలయ భూములకు జియోట్యాగింగ్ చేసింది.
టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటుకు చర్యలు!
ఆలయ భూముల పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి భూములపై అవగాహన ఉన్న వారిని ఎంచుకోవాలని అనుకుంటున్నది. ముందుగా లీగల్ ఇష్యూ ఉన్న ఆలయ భూములపై సర్కారు ముమ్మర కసరత్తు చేస్తుంది. దీంతో పాటు జిల్లాకో టాస్క్‌ఫోర్స్ టీంను సైతం ఏర్పాటు చేయాలని అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టీంలో ఎంత మంది ఉంటారు ? వారిని ఎలా ఎంపిక చేస్తారు ? అనే దానిపై ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఉద్యోగుల కొరత
దేవాదాయశాఖలో ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్నది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు(ఈఓ), ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లోనూ ఎంప్లాయిస్ కొరత ఉన్నది. ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్‌కు సైతం సిబ్బంది లేరు. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ టీంను ఎలా ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఖాళీగా ఉన్న పోస్టులు ఫిలప్ చేస్తే ఈ సమస్య తీరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
హైడ్రా తరహా చర్యలు చేపడితే..
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అనుమతిలేని భవనాలను హైడ్రా కూల్చి వేసింది. హైడ్రా చర్యల మాదిరిగానే దేవాదాయ భూముల విషయంలోనూ తీసుకుంటే బాగుంటుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఆలయ భూముల స్వాధీనం కోసం ఎలాంటి కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.