మెడికో ప్రీతి ఘటనపై గవర్నర్ తమిళి సై సీరియస్..

by Satheesh |   ( Updated:2023-02-28 08:56:18.0  )
మెడికో ప్రీతి ఘటనపై గవర్నర్ తమిళి సై సీరియస్..
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనసై గవర్నర్ తమిళి సై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మెడికో ప్రీతి మరణం భయంకరమైనదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణకు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. యూనివర్శిటీలో వేధింపులు, ర్యాగింగ్ వంటి సంఘటనలను ఎదుర్కోవటానికి ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌పై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని గవర్నర్ కోరారు.

మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల డ్యూటీ అవర్స్, మెడికల్ కాలేజీలు మరియు ఆసుపత్రులలో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు గురించి ఆరా తీశారు. వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌, వేధింపుల నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, విద్యార్థినులకు, ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ ఆదేశించారు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం.. ప్రతి వైద్య కళాశాలలో సైకియాట్రీ విభాగానికి చెందిన హెచ్‌ఓడి నేతృత్వంలో విద్యార్థి కౌన్సెలింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా మెడికోలకు అధ్యాపకులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed