- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘లోకల్’పై సర్కారు ఫోకస్.. సమస్యల పరిష్కారానికి కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాల వారీగా విలేజెస్‌లో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే తీర్చేలా చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తున్నది. పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ సైతం మొదలయ్యింది. అలాగే పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేందుకు ఈ సమావేశంలో డెసిషన్ తీసుకున్నారు. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను మొదలు పెట్టారు.
నెల రోజుల్లో టార్గెట్ రీచ్..
ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ లోపు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా పంచాయతీల్లో ఉన్న శానిటేషన్ ప్రాబ్లమ్స్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నది. అందుకోసం ప్రతి మండలంలో గ్రామాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ కింద గ్రామాల్లో మంచి నీటి సరఫరా జరుగుతున్నది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఉపయోగించిన బోర్లను రిపేర్ చేసి రెడీగా ఉంచారు.
92 వేల మంది కార్మికులకు ప్రయోజనం..
రాష్ట్రంలో సుమారు 92 వేల మంది పంచాయతీ కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇటీవలే జరిగిన రివ్యూలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించడంతో పాటు ఇక నుంచి రెగ్యూలర్‌గా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వడం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవనే చర్చ జరుగుతున్నది.
ఉపాధి పనుల బిల్లులు క్లియర్..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్ల ఉపాధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల రోజుల్లో వీటిని క్లియర్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. అయితే ఇందులో కొంత స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించకపోవడంతో కేంద్రం తన వాటాను విడుదల చేయలేదని తెలుసుకున్న సీఎం రేవంత్ స్టేట్ నిధులు వెంటనే జమ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
దశల వారిగా సర్పంచ్ బిల్లులు..
బీఆర్ఎస్ హయంలో సర్పంచులు పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. కానీ వాటికి బిల్లులు మాత్రం చెల్లించలేదు. కొన్ని చోట్ల ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఉన్న పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ప్రతి నెలా 25 శాతం చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో దాదాపు రూ.200 కోట్లను మాజీ సర్పంచులు చేసిన పనులకు చెల్లించినట్లు సమాచారం. వచ్చే నెల దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉంది.