- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt: చేనేత పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 10న తెలంగాణ నేతన్న పొదుపు పథకం, తెలంగాణ నేతన్న భరోసా, తెలంగాణ నేతన్న భద్రతా పథకాలతో పాటు జీవో నంబర్-3 ద్వారా రూ.163 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో టీపీసీసీ చేనేత విభాగం నేతలు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శనివారం హైదరాబాద్నాంపల్లిలోని గాంధీ భవన్ ఆవరణలో రాష్ట్ర అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ పిలుపు మేరకు చేనేత విభాగం నేతలు బొగ జగదీష్, మసున రవి, వున్న గణేష్, నర్సింగ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
చేనేతలకు ఇంత మంచి పథకాలు ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, చేనేత శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్‌కు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ చేనేత విభాగం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చేనేత విభాగం నేతలు వెల్లడించారు. నిధులు విడుదల చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి తెలంగాణ కాంగ్రెస్ చేనేత విభాగం పక్షాన ప్రత్యెక ధన్యవాదాలు చెప్పారు.