- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ అధికారికి శాపంగా మారిన ప్రభుత్వ నిర్లక్ష్యం.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) నిర్లక్ష్యం (negligence) రిటైర్డ్ పోలీస్ అధికారి (retired police officer)కి శాపంగా మారిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS leader Harish Rao) అన్నారు. అనారోగ్య సమస్యల (health problems)తో బాధపడుతున్న విశ్రాంత పోలీసు ఉద్యోగి ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. ఈ పోలీస్ అధికారి ఆవేదన చూస్తే హృదయం కల్చివేస్తున్నదని (Heart Breaking), 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ (Tagore Narayan Singh) ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం బాధాకరమని అన్నారు. ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్ కి వెళ్తే చెల్లదు అని పంపిస్తున్నారని వాపోయారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా (curse) మారిందని, ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8000 మంది ప్రభుత్వ ఉద్యోగుల (8000 retired government employees) జీవన్మరణ సమస్య (life-or-death problem) అని అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy).. మీకు ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ (retirement benefits)ను చెల్లించండి (immediately pay) అంటూ.. వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్ (EHS), పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు (Police Health Security Cards) ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipeta MLA) డిమాండ్ (demanded) చేశారు.