రైతులకు KCR గుడ్ న్యూస్.. ఆ పంటను మద్దతు ధరకు కొనాలని సర్కార్ నిర్ణయం

by Satheesh |
రైతులకు KCR గుడ్ న్యూస్.. ఆ పంటను మద్దతు ధరకు కొనాలని సర్కార్ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోళ్లు చేపట్టాలని మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ. 219. 92 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం తీసుకున్న నిర్ణయంతో లబ్ది చేకూరనుంది.

Advertisement

Next Story

Most Viewed