‘తప్పని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా’.. కేటీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్

by Satheesh |
‘తప్పని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా’.. కేటీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ముందుగా ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడింది ఎవరని ప్రశ్నించారు. గతంలో టీడీపీ నుండి వచ్చిన తలసానిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారని గుర్తు చేశారు. అదే విధంగా రాజీనామా చేయించకుండానే మరో 46 మంది ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. తన మాటలు వాస్తవాలు కాదని రుజువు చేయాలని కేటీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. ఒకవేళ కేటీఆర్ నా మాటలు తప్పని ప్రూవ్ చేస్తే నా పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్‌లోకి వస్తారని.. బీఆర్ఎస్ పార్టీని కూల్చడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed