Goods Trains: గూడ్స్ రైలులో పొగలు.. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

by Shiva |
Goods Trains: గూడ్స్ రైలులో పొగలు.. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా కొంత మంది ఆగంతకులు రాత్రి వేళల్లో రైల్వే ట్రాక్‌లపై పెలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, పెద్ద పెద్ద బండరాళ్లు, ఐరన్ రాడ్స్ పెట్టి విధ్వంసానికి దిగుతున్నారు. అయితే, ట్రైన్ నడిపే లోకో పైలెట్లు (Loco Pilots) ముందుగానే ప్రమాదాలను ఎప్పటికప్పుడు పసిగట్టి రైల్వే అధికారులకు (Railway Officials) సమాచారం అందజేస్తూ.. ప్రయాణికులను వాళ్ల గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.

తాజాగా, హనుమకొండ (Hanumakonda) పరిధిలో మందమర్రి (Mandamarri) నుంచి కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి గూడ్స్ రైలు (Goods Train) వెళ్తోంది. ఈ క్రమంలోనే కమలాపూర్ (Kamalapur) మండలం ఉప్పల్ (Uppal) వద్దకు రాగానే రైలులో ఉన్నట్టండి దట్టమైన పొగలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన అధికారులు రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. హుటాహుటిన దగ్గర్లోని ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆ రూట్లో పలు ప్యాసింజర్ రైళ్లు (Passenger Trains) ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story