Good News: ప్రజలకు కూటమి సర్కార్ దీపావళి కానుక.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే!

by Shiva |
Good News: ప్రజలకు కూటమి సర్కార్ దీపావళి కానుక.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండగ వేళ కూటమి సర్కార్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఇవ్వనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పథకానికి కేబినెట్ (Cabinet) ఆమోద ముద్ర వేసింది. నాలుగు నెలలకు గాను ఓ సిలిండర్ చొప్పున మొత్తం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాలని మంత్రి వర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకం (Ujwala Scheme), రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీపం పథకం (Deepam Scheme) కింద ఆ మూడు సిలిండర్లను ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా సర్కార్‌పై ఏడాదికి రూ.2,700 కోట్ల భారం పడబోతోంది.

గత ప్రభుత్వం హయాంలో వివాదాస్పదంగా మారిన చెత్త పన్నును రద్దుకు కేబినెట్ (Cabinet) ఓకే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Reimbursement of Fees) బకాయిలు రూ.3,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయాల్లో పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచుతూ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా తీసుకోవాలని కండీషన్ పెట్టారు.

రాష్ట్రంలో అమలు అవుతోన్న ఉచిత ఇసుక విధానంలో కూడా సీనరేజ్, జీఎస్టీ (GST) ఛార్జీల రద్దుకు కేబినెట్ ఓకే చెప్పింది. సీనరేజ్ ఛార్జీ రద్దుతో ప్రభుత్వం మరో రూ.264 కోట్ల భారం పడనుందని అధికారులు తెలిపారు. పీఠాధితి స్వరూపానందేంద్రకు చెందిన శారదా పీఠానికి (Sarada Peetam) జగన్ సర్కార్ (Jagan Government) అప్పనంగా కట్టబెట్టిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది.

Advertisement

Next Story