ఆగని పసిడి ధర పరుగు

by M.Rajitha |
ఆగని పసిడి ధర పరుగు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధరల(Gold, Silver Prices) పరుగు ఆగడం లేదు. రోజురోజుకీ ఆల్ టైమ్ రికార్డ్ గరిష్టాలను తాకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర బుధవారం సాయంత్రం ఏకంగా రూ. 500 పెరిగి, రూ.81,500 కు చేరుకుంది. వెండి కూడా రూ.వెయ్యి పెరిగి, రూ.1.02 లక్షలకు చేరింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే బంగారం రూ.2850 పెరగగా.. వెండి రూ.10 వేల దాకా పెరిగింది. ఇక హైదరాబాద్ లో 24k బంగారం రూ.80,070 ఉండగా.. 22k బంగారం రూ.73,400 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,12,000 గా ఉంది. రానున్న దీపావళి, పెళ్ళిళ్ళ సీజన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు కలిసి.. బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ 2764 వద్ద, వెండి ఔన్స్34.74 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

Next Story