- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మానకొండూరు ఎమ్మెల్యే
దిశ,బెజ్జంకి : కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దేవక్కపల్లి, వడ్లూరు , గూడెం,వీరాపూర్,దాచారం, బెజ్జంకి గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు.
ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎట్టి పరిస్థితుల్లోను దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన రైతులనూ కోరారు. ఈ కార్యక్రమంలో ప్యాంక్స్ చైర్మన్ శరత్ రావు, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓగ్గు దామోదర్, ముక్కస రత్నాకర్ రెడ్డి, యండి , పులి సంతోష్,సాదిక్, జంగిడి సంజీవరెడ్డి, గోవర్థన్ రెడ్డి,రావుల రామకృష్ణ రెడ్డి, పంజాల అంజయ్, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ అనుబంధ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.