క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి

by Sridhar Babu |
క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి
X

దిశ, సుల్తానాబాద్ : ఆటల పోటీల్లో గెలుపు, ఓటముల కంటే నైపుణ్యతను పెంపొందించుకోవడమే ప్రధానమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాలయాల క్రీడోత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్, క్రీడాకారులు నైపుణ్యతపై దృష్టి పెట్టి రాణించాలన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగానికి బడ్జెట్లో అధిక నిధులను కేటాయిస్తున్నట్టు తెలిపారు.

ఇందులో భాగంగానే సీఎం కప్ - 2024 నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒలింపిక్స్ లో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని చెప్పారు. సుల్తానాబాద్ మండలం క్రీడలకు పుట్టినిల్లు అని, ఇలాంటి ప్రాంతంలో ఎంజేపీ విద్యాలయాల ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జె.రాజేశం, ఎంజేపీ విద్యాలయాల జిల్లా కన్వీనర్ మణిదీప్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, చిలుక సతీష్, జానీ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story