- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాకు 3000 మంది ఉత్తర కొరియా సైనికులు!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా నిలబడుతున్నదని, రష్యాకు ఏకంగా సైనికులనూ పంపి సహకరిస్తున్నదని దక్షిణ కొరియా ఆరోపిస్తున్నది. 3000 మంది సైనికులను రష్యాకు ఉత్తర కొరియా పంపిందని దక్షిణ కొరియా చట్టసభ్యులు మీడియాకు తెలిపారు. ఆ దేశ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఇచ్చిన తర్వాత ఈ వివరాలు వెల్లడించినట్టు వివరించారు.
రష్యాకు మొత్తం 10 వేల మంది సైనికులను సహకారంగా పంపిస్తామని ఉత్తర కొరియా హామీ ఇచ్చిందని, ఈ ఏడాది డిసెంబర్‌లోపు వీరినంతా రష్యాకు పంపించాలనే లక్ష్యాన్ని పెట్టుకుందని దక్షిణ కొరియా చట్టసభ్యులు వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కానీ, ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియాలు ఖండించాయి. ఒక వేళ ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా తలదూర్చితే పరిణామాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి మిత్రపక్షాలతో అమెరికా సంప్రదింపులు జరుపుతున్నది. ఒక వేళ ఉత్తర కొరియా నిజంగానే జోక్యం చేసుకుంటే అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొంది. ఉత్తర కొరియా 1500 మంది సైనికులను రష్యాకు షిప్‌లో పంపించిందని శుక్రవారం దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది.