- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెట్ అభ్యర్థులకు శుభవార్త.. వెబ్సైట్లో పాత హాల్ టికెట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో గతంలో టెట్ రాసిన అభ్యర్థులకు కొత్త కాలం సృష్టించారు. దీంతో పాత అభ్యర్థులకు చాలా ఇబ్బందులు తప్పాయి. దీనిపై ఇంకా అవగాహన రాకపోవడంతో చాలా మంది దరఖాస్తులకు దూరమవుతున్నారు. తాజాగా టెట్ వెబ్సైట్లో పాత హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
వచ్చే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీతో పాటుగా ప్రస్తుతం టెట్ అప్లికేషన్ సబ్మిషన్లో భాగంగా రాసిన టెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన టెట్ హాల్ టికెట్ నెంబర్లను ఎంట్రీ చేసేందుకు ప్రత్యేక కాలంను రూపొందించారు. అయితే, చాలా మంది అభ్యర్థుల దగ్గర పాత హాల్ టికెట్లు లేకపోవడంతో.. దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల్లో ఇప్పటి వరకు కేవలం 12 వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా దాదాపుగా 3 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంది. దీంతో డీఈడీ, బీఈడీ అభ్యర్థులు టెట్ అధికారులను కలిసి పాత హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెట్ వెబ్సైట్లో ఉమ్మడి ఏపీలో 2011 నుంచి 2014 వరకు నిర్వహించిన నాలుగు టెట్లతో పాటుగా తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్వహించిన రెండు టెట్‌లకు సంబంధించిన అభ్యర్థుల హాట్ టికెట్లను టీఎస్ టెట్ వెబ్సైట్ www.tstet.cgg.gov.inలో పొందుపర్చారు.
అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ లేదా టెట్ అప్లికేషన్ ఐడీ నెంబర్ ఎంట్రీ చేస్తే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. టెట్ అప్లికేషన్ ఫారంలో అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించిన టెట్ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంట్రీ చేస్తే మార్కులు కనిపిస్తాయి. ప్రస్తుతం నిర్వహించే టెట్‌లో సాధించిన మార్కులను బట్టి దేనిలో ఎక్కువ వస్తే వాటిని డీఎస్సీలో 20 శాతం వెయిటేజీకి కలుపుతారు. ఇది ఒక విధంగా టెట్ రాసే అభ్యర్థులకు శుభవార్తే.