Good News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Shiva |   ( Updated:2024-08-25 14:57:57.0  )
Good News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువులు చదవి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 1,130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆ సంస్థ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ నెల నుంచి 31 నుంచి సెప్టెంబర్ 30 దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్లను ‌సబ్మిట్ చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కూర్తి చేసి 01.10.2001 నుంచి 30.09.2006 మధ్య కాలంలో పుట్టిన వారై ఉండాలి. పీఈటీ, పీఎస్‌టీ, సర్టిఫికెట్ పరిశీలన, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed