TGSRTC : విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్‌!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-19 07:51:43.0  )
TGSRTC : విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్‌!
X

దిశ, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం టీజీఆర్టీసీ(TGSRTC) ప్రత్యేక రాయితీల‌(Special Discounts)ను యాజ‌మాన్యం ప్రక‌టించింది. ఈ విషయాన్ని టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ.సజ్జనార్(MD V.C. Sajjanar) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జరీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోందని తెలిపారు. జీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.

ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాట్ల పై నిర్ణయం తీసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందునా అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.

Next Story

Most Viewed