ఆదిలాబాద్ ప్రజలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్

by GSrikanth |
ఆదిలాబాద్ ప్రజలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. సోమవారం నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌లో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రజా దర్బార్‌లో సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి పక్కన పడేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలా జరగదని మాటిచ్చారు. ఇచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్వార్ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఇప్పటికే వచ్చిన అర్జీల్లో అనేక సమస్యలను ఆయా జిల్లాల అధికారులు పరిష్కరించారని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన అర్జీలు సైతం వెంటనే పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రికే నేరుగా సమస్యలు చెప్పుకునే పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని అన్నారు. గత పదేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని విమర్శించారు. కాగా, నాగోబా జాతరను ఆదిలాబాద్ గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. జాతర సందర్భంగా ఈనెల 12న ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆ రోజున స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లోకల్ సెలవు ప్రకటించారు.

Advertisement

Next Story