నుమాయిష్ సందర్శకులకు గుడ్ న్యూస్

by GSrikanth |   ( Updated:2023-01-02 07:14:46.0  )
నుమాయిష్ సందర్శకులకు గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లిలో నుమాయిష్ సందర్శకులకు హైదరాబాద్ మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మెట్రో ఆఖరి రైలు 11 గంటలకు బయలుదేరుతుండగా.. నుమాయిష్ ముగిసే వరకు చివరి సర్వీసు అర్థరాత్రి 12 గంటల బయలుదేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నగరంలో నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు.. అంటే ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు. కాగా, మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు తెలిపారు. మొత్తం మీద 4.57 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని తెలిపారు. జనవరి 1 ఆదివారం కావడంతో మెట్రోలో భారీగానే ప్రయాణించారు. ఇక, మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని, మెట్రో సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read...

Mukkoti Ekadashi.. రాజన్నకు భక్తుల తాకిడి

Advertisement

Next Story