రేషన్ కార్డు లేని రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
రేషన్ కార్డు లేని రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ కాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) అన్నారు. త్వరలో తెల్లరేషన్ కార్డు(Ration cards)లు లేని వారికి కూడా రుణమాఫీ(Runamafi) వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని అన్నారు. పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిందని విమర్శించారు. గత ఐదేళ్లు రుణమాఫీ గురించి మాట్లాడలేదని గుర్తుచేశారు. కెనాల్ మరమ్మతులు పూర్తి చేసి రేపటి నుంచి సాగునీరు అందిస్తామని అన్నారు. కాగా, సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం దిగువన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ అండర్ టన్నల్ పునర్నిర్మాణం, కాల్వ గండి పూడ్చివేత పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. వరద ప్రభావంతో ధ్వంసమైన తీరును, కాలువ కట్టకు గండ్లు పడిన తీరును జల వనరులశాఖ అధికారులు మంత్రికి వివరించారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి కాల్వ కు నీటిని విడుదల చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed