రైతులకు శుభవార్త.. వారి అకౌంట్లలో రైతు‌బంధు డబ్బులు జమ!

by Disha Web Desk 14 |
రైతులకు శుభవార్త.. వారి అకౌంట్లలో రైతు‌బంధు డబ్బులు జమ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు స్కీమ్ డబ్బులు పడుతున్నాయని సమాచారం. ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిసింది. 3 రోజుల పాటు 39 లక్షల ఎకరాలకు నిధులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంట నీట మునిగిన విషయం తెలిసిందే.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పది జిల్లాల్లో 1,58,121 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మార్చి నెలలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.

Read More...

BREAKING: తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కార్

Next Story

Most Viewed