రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అంటే..?

by Rajesh |   ( Updated:2024-05-25 05:17:42.0  )
రైతులకు గుడ్ న్యూస్..  రుణమాఫీ కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుపై కసరత్తును స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా బహిరంగసభల్లో మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం కానుండగా రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది.

ఒక వేళ అలా కానీ పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను సర్కారు అన్వేషిస్తోంది. కాగా ప్రభుత్వం కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేయనుండగా.. రూ.2లక్షల కంటే ఎక్కవ రుణాలు ఉంటే వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు ఉంటే అన్ని కలిపి లెక్క తీయనున్నారు. దీర్ఘకాలిక రుణాలకు మాఫీ వర్తించదనే చర్చ జరుగుతోంది. బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు మాఫీ కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed