ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

by GSrikanth |
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సమస్యల్లో వేతనాల సమస్యే కీలకమైనది. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎర్కొంటున్నారు. తాజాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు పడేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పెన్షన్లు కూడా అదే విధంగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం అప్పుల కుప్పగా మార్చేసిందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అప్పులు కాదు, సంపద సృష్టించామంటూ స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై సౌధపత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed