- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News: చేనేత కార్మికులకు మరో తీపి కబురు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోనే చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ (Worker to Owner) పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao), ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (Principal Secretary Shailaja Ramayer) పథకం అమలుపై హైదరాబాద్ (Hyderabad)లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పథకంలో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్ల (Weaving Sheds)లో పవర్ లూమ్స్ (Power Looms)ను బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. ఈ మేరకు త్వరలోనే పథకానికి అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ జిల్లాలో 5 వేల మంది నేత కార్మికులుండగా 2 వేల మంది పేదరికంలో ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు.
తొలి విడతలో 1,104 మంది కార్మికులను ఎంపిక చేసి ఓనర్లుగా మార్చేందుకు లబ్ధిదారులను గుర్తించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద రూ.8 లక్షల విలువైన పవర్ లూమ్స్‌ను ఇవ్వనున్నారు. యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంక్ లోన్, రూ.10 శాతం లబ్ధిదారుడు చెల్లించేలా ప్రణాళికలు రూపొందిచాలని ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక వర్కర్ టూ ఓనర్ (Worker to Owner) పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా టెస్కో జనరల్ మేనేజర్ అశోక్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని అన్నారు. మరో వారంలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. లూమ్స్ బిగించడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తుండగా వారందరితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.