హైడ్రా వలన మత్స్యకారులకు మంచి రోజులు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

by M.Rajitha |
హైడ్రా వలన మత్స్యకారులకు మంచి రోజులు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ధ్వంసంతోనే మత్స్యకారుల కుటుంబాలన్నీ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. చెరువులు, కుంటలు ఆక్రమించి, కట్టడాలు, నిర్మాణాలు చేపట్టడంతో వేలాది మంది ఉపాధిని కోల్పోయారన్నారు. గడిచిన పదేళ్లలో ఊహించని కబ్జాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ విలేజ్ కు వెళ్లినా, చెరువుల కబ్జాలు, ఆక్రమణల అంశాలే వినిపిస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయి నుంచి స్టేట్ వరకు బీఆర్ఎస్ నేతలంతా కబ్జాల మత్తులోనే ఊగారన్నారు. అందుకే కాంగ్రెస్ పవర్ లోకి రాగానే హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. చెరువులని అక్రమంగా కబ్జా చేసిన వారి పై చర్యలు తీసుకుంటూనే, పర్యావరణ పరిరక్షణకు కాపాడుతుందన్నారు. భవిష్యత్ లో హైడ్రా ద్వారా మంచి మార్పులు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీ నేతలు అక్రమంగా చెరువులను కబ్జా చేశారన్నారు. ప్రభుత్వ సంపదను దోచుకొని కబ్జా చేసే అధికారం ఏ పార్టీకీ లేదన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ ఎస్ తమ పార్టీ, నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. హైడ్రా యాక్షన్ ప్లాన్ ను సైడ్ ట్రాక్ పట్టించేందుకు బీఆర్ఎస్, తన సోషల్ మీడియా నిర్వీరామంగా కృషి చేస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించేందుకు సీఎం తపన పడుతున్నారన్నారు. హైడ్రా యాక్షన్ ప్లాన్ ను చూసి హరీష్ రావు, పల్లా, మల్లా రెడ్డి ఎందుకు అగమౌతున్నారని? ప్రశ్నించారు. శాటిలైట్ సర్వేలతో పాటు హైడ్రా ఆఫీసర్లు ఫిజికల్ గానూ ఎంక్వైయిరీ చేస్తున్నారని గుర్తు చేశారు.

Next Story

Most Viewed