BRS: ఫార్మా క్లస్టర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Ramesh Goud |
BRS: ఫార్మా క్లస్టర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొడంగల్ ఫార్మా క్లస్టర్(Kodangal Pharma Cluster) ఏర్పాటును ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former minister Niranjan Reddy) డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendra Reddy), రైతులను(Farmers) వెంటనే విడుదల చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన రైతులను భేషరతుగా విడుదల చేయాని డిమాండ్ చేశారు. కొడంగల్ లో అధికారులపై రైతన్నల తిరుగుబాటు ప్రభుత్వ వైఫల్యానికి(Government's Failure) నిదర్శనం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం .. ఇంటింటా దౌర్భాగ్యం అన్న పరిస్థితులను తీసుకువచ్చారని దుయ్యబట్టారు.

ఇండ్లు కూలగొడతారని ప్రజలు, భూములు లాక్కుంటారని రైతులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల నుండి, ఆడబిడ్డలు, అవ్వా,తాతలు, ఆటోడ్రైవర్లు, రైతన్నలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారని, ముఖ్యమంత్రి(CM రేవంత్ Reddy), ఉప ముఖ్యమంత్రి(డిప్యూటీ సీఎం భట్టి Vikramarka), మంత్రులు(Ministers) విదేశీ పర్యటనలు(Foreign Tours), పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చిందో సమీక్షించుకునే తీరిక కూడా వారికి లేదన్నారు. 11 నెలలలో 80 వేల కోట్లు అప్పులు తెచ్చి ఒక్క పథకం అమలు చేయడం లేదన్నారు. సంక్షేమ పాలన పోయి సంక్షోభ పాలన వచ్చిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ(Pharmacity) కోసం 18 వేల ఎకరాలు సేకరించిందని, దానిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ ల పేరిట రైతులలో ఆందోళన పెంచి రచ్చ చేసుకోవడం ఏం విజ్ఞత అని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed