- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Textile: పవర్ లూమ్ కార్మికుల ఆత్మహత్యలను నివారించాలి.. కూరపాటి రమేష్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించి ఆత్మహత్యలను నివారించాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్(Telangana Power Loom Workers Union) రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూరపాటి రమేష్(Kurapati Ramesh) కోరారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య విధానంతో రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ(Textile Industry)పై ఆధారపడిన పవర్ లూమ్ కార్మికులు(Power Loom Workers) ఉపాధి కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని(Committing Suicide) ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే సిరిసిల్ల(Sirisilla) ప్రాంతంలోనే 16 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గడిచిన రెండ్రోజుల వ్యవధిలోనే పవర్ లూమ్ కార్మికులు బైరి అమర్, స్రవంతి దంపతులు(Bairi Amar, Sravathi couple), ఎర్రం కొమురయ్య(Erram Komuraiah) ఆత్మహత్య(Suicide) చేసుకున్నారని, ఇది సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు.
కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సిరిసిల్ల నేడు ఉరిసిల్లగా మారుతుందన్నారు. పవర్ లూమ్ కార్మికుల చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో బతుకమ్మ చీరల పథకంతో కార్మికులకు ఉపాధి కలిగేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేయడంతో ఉపాధి కోల్పోయారన్నారు. స్వయం సహాయక బృందంలోని మహిళలకు రెండు చీరలు చొప్పున ఇస్తామని దీనితో ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా నేటికీ చీరల ఉత్పత్తిని ప్రారంభించలేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యల తీవ్రతను అర్ధం చేసుకొని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వదిలి ఉపాధి కల్పనపై దృష్టిసారించాలని కోరారు. వర్కర్ టు ఓనర్ పథకం(Worker-to-owner Scheme) అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.