Gold Rates: శ్రావణ మాసంలో మహిళలకు బంపర్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

by Shiva |
Gold Rates: శ్రావణ మాసంలో మహిళలకు బంపర్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు ఉన్న వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో మహిళల పంట పండనుంది. ఇంటర్‌నేషనల్ మార్కెట్‌ ప్రభావం బంగారం కొనుగోళ్లపై పడటంతో గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ ధరలు వరుసగా పడిపోతూ వస్తున్నాయి. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.1,100లకు పడిపోయింది. అదేవిధంగా కిలో వెండిపై రూ.2,200 తగ్గింది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో కూడా బంగారం, వెండి ధరల్లో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. ఇక హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 24 క్యారెట్ బంగారం 10 గ్రాములపై రూ.74 తగ్గి రూ.67,200 వద్ద ధర కొనసాగుతోంది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాములపై రూ.70 తగ్గి రూ.64 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.87,400 వద్ద ధర కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed