రూ.3 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదం : AAP' leader Indira Shobhan

by Nagaya |   ( Updated:2022-12-11 16:36:47.0  )
రూ.3 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదం : AAP leader Indira Shobhan
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు అని హామీలిచ్చి ఓట్లు దండుకుని రెండుసార్లు గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తిరిగి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్ విమర్శలు చేశారు. గతంలో హామీ ఇచ్చిన సమయంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవని, ఆ డబ్బులకు ఇల్లు కాదు కదా.. ఇంటి పిల్లర్ కూడా నిర్మించడం కష్టమేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు తమ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం కనీసం రూ.6 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story