- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం సరికాదు’
దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్-5 జోన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సీఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆర్-5 జోన్ ఏర్పాటును సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇతర ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్, లాయర్లు ఆంజనేయులు, ఉణ్నం మురళీధర్‌లు తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో రాజధాని కేసు విచారణలో ఉందని.. అక్కడకి వెళ్లొచ్చుకదా అని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే తాము కేవలం రాజధాని భూములపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయ సమ్మతం కాదని వాదించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు ఇవ్వడానికి వీల్లేదంటూ మండిపడుతున్నారు.రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.