- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Praja Bhavan : మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి.. ప్రజాభవన్‌లో జూనియర్ లెక్చరర్ల ధర్నా
దిశ, డైనమిక్ బ్యూరో: మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండని జూనియర్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. తాజాగా హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ (Praja Bhavan)లో జూనియర్ లెక్షరర్ల అభ్యర్థులు (JL Aspirants) ధర్నా చేపట్టారు. 1392 మంది (TGPSC) టీజీపీఎస్సీ జూనియర్ లెక్షరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జులై నెలలో ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో.. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను విడుదల చేసి.. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో ఫైనల్ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.