High Court: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో హైకోర్టు కీలక ఆదేశం

by Prasad Jukanti |
High Court: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో హైకోర్టు కీలక ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో తెలంగాణ హైకోర్టు (TG High Court) కీలక తీర్పు ఇచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలకు (Gated Community Executive Committee) నోటీసులు ఇవ్వాలని మంగళవారం సైబరాబాద్ సీపీకి (Cyberabad CP) హైకోర్టు ఆదేశించింది. గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో అసాంఘిక పనులు చేస్తున్నారని కేపీహెచ్ బీలోని ఇందు ఫార్చున్ ఫీల్డ్ విల్లాస్ (KPHB Indu Fortune Field Villas) నివాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువరించిన కోర్టు.. నిబంధనలు పాటించేలా నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఇందు ఫార్చున్ ఫీల్డ్ విల్లాస్ లో ముగ్గురితో ప్రత్యేక కమిటీ వేయాలని, క్లబ్ హౌస్ కార్యకలాపాలను ప్రతిరోజు పరిశీలించాలని కమిటీని ఆదేశించింది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, విల్లాల్లో ఉండేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Next Story