మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి.. ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేసిన GHMC

by Satheesh |   ( Updated:2023-04-29 08:33:12.0  )
మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి.. ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేసిన GHMC
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఇవాళ కురిసిన భారీ వర్షాల కారణంగా సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో ఓ బాలిక మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం ఇంటి నుండి పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలిక మ్యాన్‌హోల్‌లో పడి మృత్యువాత పడింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే ఆ పాప మృతి చెందిందని స్థానికులు మండి పడుతున్నారు. దీంతో కళాసిగూడ చిన్నారి ఘటనలో జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. చర్యల్లో భాగంగ ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేసింది. వర్క్ ఇన్స్ స్పెక్టర్ హరికృష్ణ, బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుమలయ్యను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story