- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన బంధు ఇప్పట్లో లేనట్లే..!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాన్ని నిధుల కొరత వెంటాడుతున్నది. అత్యవసరాలకే ఫండ్స్ వినియోగించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన బంధు అమలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది బడ్జెట్ లో పెట్టాకే దీన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఓ గిరిజన మంత్రితో ఎమ్మెల్యేలకు ఈ విషయాన్ని చేరవేసినట్లు సమాచారం. దీంతో గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఆ సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు లాగే గిరిజన బంధు అమలు చేస్తామని సెప్టెంబర్ 17న ప్రకటించారు. మూడు నెలలు గడుస్తున్నా ఈ స్కీమ్ పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ మార్గదర్శకాలు రూపొందించలేదు. దళితబంధును ప్రకటించిన సమయంలో హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేశారు. కానీ గిరిజన బంధు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. అయితే భూమిలేని గిరిజనులకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూమిలేని గిరిజనులను గుర్తించేందుకు జిల్లా మంత్రుల అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ చేపట్టలేదు.
కేబినెట్ మీటింగ్ లో చర్చ!
ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్ గిరిజన బంధు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వచ్చే బడ్జెట్ లో గిరిజనబంధుకు నిధులు కేటాయించి శ్రీకారం చుడతామని కేసీఆర్ పేర్కొన్నట్లు ఓ మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ఎస్టీ రిజర్వుడ్ ఎమ్మెల్యేలు, అధికారులకు చెప్పినట్లు తెలిసింది. గిరిజనుల నుంచి పథకం అమలు కోసం ఒత్తిడి వస్తుందని గ్రహించి ముందస్తుగానే చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, అధికారుల వద్దకు వచ్చే గిరిజనులకు పథకం ఆలస్యానికి కారణాలు వివరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం
గిరిజనులను మభ్యపెట్టి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికే గిరిజన బంధు ప్రకటించినట్లు కనిపిస్తున్నది. మూడు నెలలవుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూమిలేని వారికే వర్తింపజేస్తామని చెప్పడం సరికాదు. అలా కాకుండా ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని, దళిత బంధు మాదిరిగా అర్హులందరికీ గిరిజన బంధు వర్తింపజేయాలి. త్వరలో గైడ్ లైన్స్ ప్రకటించాలి. గిరిజన బంధు అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. -ఆర్.శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం
Also Read..