- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీ.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరవాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ ఆర్థికంగా కుదేలైంది. ఇప్పటి వరకు ఎస్ఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ ప్రాజెక్టులతో పాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన సీఆర్ఎంపీ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు బల్దియా రూ.6,500 కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎక్కడా అప్పులు కూడా పుట్టకపోవటంతో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడింది. ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, భవన నిర్మాణ అనుమతుల జారీతో వచ్చే ఆదాయం మొత్తం చేసిన అప్పుల అసలు, మిత్తీలకు సంబంధించి ఏటా రూ.1,200 కోట్లు (నెలకు రూ.వంద కోట్లను) చెల్లింస్తుండటంతో జీహెచ్ఎంసీ ఖజానా ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది.
రూ.4 వేల కోట్లకు ప్రతిపాదనలు..
గత సర్కారు ఆమోదించిన, కొత్త సర్కారు సూచించిన ప్రాజెక్టుల పనుల కోసం కనీసం రూ.4 వేల కోట్లను చెల్లించాలని సర్కారుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. ఎనిమిది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్కారు మారుతున్న సమయంలో టెండర్ల ప్రక్రియ చేపట్టిన పనులు చేపట్టాల్సిన సంస్థలను ఎంపిక చేసినప్పటికీ, నిధుల్లేకపోవటంతో వర్క్ ఆర్డర్ల జారీని జీహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. పంజాగుట్ట, అమీర్‌పేటలోని జీహెచ్ఎంసీ మార్కెట్ల ఆధునీకరణ పనులను నిధుల లేమితో వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆపివేసినట్లు సమాచారం. రూ.4 వేల కోట్ల విడుదల చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సర్కారుకు ప్రతిపాదనలు పంపక ముందే కొత్త సర్కారు జీహెచ్ఎంసీకి రూ.1,100 కోట్లను విడుదల చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటన వచ్చింది. ఈ మొత్తం నిధులను కూడా నాలుగు కిస్తీల్లో చెల్లించనున్నట్లు, వీటిలో ఫస్ట్ కిస్తీ రూ.275 కోట్లను ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత చెల్లించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు ఉన్న ఆదాయ వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని కూడా సర్కారు సూచించినట్లు సమాచారం.
ప్రాజెక్టులకు పీపీపీ పద్దతే..
పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ మున్ముందు నగరంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపొవడంతో మున్ముందు పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతినే అనుసరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాజెక్టునైనా జీహెచ్ఎంసీ గానీ, సర్కారు గానీ సొంతగా మొత్తం ఖర్చును భరించి చేసే అవకాశం లేకపోవడంతో ప్రజలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కొత్త సర్కారు అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకున్న మూసీ సుందరీకరణ, ప్రక్షాళన ప్రాజెక్టును సైతం సర్కారు పీపీపీ పద్దతిలోనే చేపట్టేందుకు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ పీపీపీ పద్దతినే చేపట్టేందుకు కూడా పెట్టుబడి పెట్టే వారు ముందుకు వస్తారా? అన్న అనుమానం సైతం లేకపోలేదు. మున్ముందు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల వారీగా కాకుండా సర్కారు సరికొత్తగా తెరపైకి తెచ్చిన హై-సిటీ కార్యక్రమం కిందే వివిధ రకాల అభివృద్ధి పనులు గానీ, ప్రాజెక్టులు గానీ చేపట్టే అవకాశముంది.