- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM కేసీఆర్‌తో గ్యాప్.. క్లారిటీ ఇచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి
X
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్‌యే అని కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమారస్వామి అన్నారు. సీఎం కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రాయచూర్‌లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణ పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కుమార స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామన్న కుమారు స్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని మండిపడ్డారు.
Advertisement
Next Story