గంగారెడ్డి హత్య కేసు నిందితుడి నిర్వాకం...లొంగిపోతూ రీల్స్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-22 10:54:48.0  )
గంగారెడ్డి హత్య కేసు నిందితుడి నిర్వాకం...లొంగిపోతూ రీల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. హంతకుడు తాపిగా పోలీస్ స్టేషన్ ఆవరణలో రీల్ చేసిన వీడియో వ్యవహారం పోలీసుల పనితీరును ప్రశ్నార్ధకం చేసింది. అంతకుముందే చంపుతానని బెదిరించిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని జీవన్ రెడ్డి పోలీసులను నిలదీశారు.

రౌడీ షీటర్ గా 20 కేసులు ఉన్న వ్యక్తికి ఎస్సై తో సంబంధాలు ఉన్నాయని, ఎస్సై కాల్ డాటా బయటకు తీస్తే రౌడీషీటర్ తో ఎన్నిసార్లు మాట్లాడారో తెలుస్తుందన్నారు. పోలీసుల అక్రమ దందా కాంగ్రెస్ పార్టీని హత్య చేస్తుందని విమర్శి్ంచారు. ప్రభుత్వం ఈ హత్యపై లోతైన దర్యాప్తు జరిపించి చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed