HYD: ఓల్డ్ సిటీలో గ్యాంగ్ వార్.. చిచ్చు పెట్టిన క్రికెట్ బాల్!

by GSrikanth |
HYD: ఓల్డ్ సిటీలో గ్యాంగ్ వార్.. చిచ్చు పెట్టిన క్రికెట్ బాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో/చార్మినార్: హైదరాబాద్ ఓల్డ్ సిటీ‌లో క్రికెట్ గేమ్ గ్యాంగ్ వార్‌కు దారి తీసింది. చాంద్రాయణగుట్ట బండ్లగూడా నూరినగర్‌లో ఓ గ్యాంగ్ క్రికెట్ ఆడుతుండగా బాల్ ఓ ఇంట్లోని బాల్కానీలోకి దూసుకు వెళ్లింది. దీంతో ఇంటి యజమాని అయిన ఓ మహిళ క్రికెట్ ఆడుతున్న వారిపై మండిపడింది. క్రికెట్ ఆడటానికి వేళాపాళా లేదా అంటూ కోప్పడింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగింది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది.

రెండు వర్గాలు రెండు గ్యాంగులుగా విడిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఓ వర్గం సదరు మహిళ ఇండిపై దాడి చేసి కిటికి అద్దాలు ధ్వంసం చేసింది. ఈ దాడిలో మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed