గాంధీజీ పోరాట పంథా వినూత్నమైనది: పొంగులేటి

by GSrikanth |
గాంధీజీ పోరాట పంథా వినూత్నమైనది: పొంగులేటి
X

దిశ బ్యూరో, ఖమ్మం: గాంధీజీ ఆలోచనలు.. భావాలు.. సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మహత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తన సిద్ధాంత బలంతో రవి ఆస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారన్నారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనదని కొనియాడారు. అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పించారు.

Advertisement

Next Story

Most Viewed