టీ-కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మరో డీసీసీ ప్రెసిడెంట్ రాజీనామా

by Satheesh |   ( Updated:2023-10-18 14:32:33.0  )
టీ-కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మరో డీసీసీ ప్రెసిడెంట్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలింది. గద్వాల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో పటేల్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పూల కర్ణాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, అల్క్జాండర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ, బంగి ప్రియాంక ఎంఐఎం కౌన్సిలర్, బంగి సుదర్శన్ ఎమ్‌ఎమ్ టౌన్ ప్రెసిడెంట్, రఘు నాయుడు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్ ధరూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్వనాథ్ రెడ్డి కేటి దొడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉమాదేవి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని.. సీఎం కేసీఆర్‌‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో బీఆర్ఎస్‌లో చేరానని అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేసి.. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని, బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.

కాగా, కర్నాటక ఎన్నికల గెలుపుతో పాటు రాష్ట్రంలో వరుసగా చేరికలో జోష్‌లో ఉన్న హస్తం పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్ రాజీనామా చేయడం షాక్ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు హస్తానికి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, టికెట్ దక్కలేని అసంతృప్తితో ఇప్పటికే మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్, మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మరో జిల్లా అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed