- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాబోయే సీఎం కేటీఆర్.. కూకట్‌పల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లి పర్యటనలో వినూత్న ఫ్లెక్సీలు వెలుగుచూశాయి. ఓవైపు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం సృష్టించగా.. మరోవైపు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో నెక్స్ట్ సీఎం మంత్రి కేటీఆర్ అవడం లాంఛనమైనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నేడు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్‌కు కాబోయే సీఎం కేటీఆర్‌కు స్వాగతం అంటూ మాజీ కార్పోరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, గతంలోను ఈ తరహాలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తు్న్నాయి.