Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ క్షమాపణలు.. వైరల్‌గా మారిన వీడియో

by sudharani |
Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ క్షమాపణలు.. వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 28987ఏడీ’ (Kalki 2898AD) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపికా పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటనీ(Disha Patani), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

అయితే.. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌ (Japan)లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. దీంతో అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే ప్రభాస్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘డియన్ ఫ్యాన్ సారీ.. సినిమా షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయం అయింది. ప్రస్తుతానికి నేను రాలేకపోతున్నారు. కానీ త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘కల్కి’ని ఎంజాయ్ చేయండి అంటూ జపనీస్‌లో మాట్లాడటంలో ఈ వీడియో ప్రజెంట్ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story