- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
దిశ ,నాగర్ కర్నూల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా దిగింది. కొన్నేళ్లుగా సహజీవనం చేసిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని నిరసనకు దిగింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్ కుమార్, నూర్జహాన్ ఇరువురు ప్రేమించుకున్నారు.పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి..గత కొన్నేళ్లుగా సహజీవనం చేశారు. గత కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తేవడంతో..ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో షీ టీం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి వ్యక్తిని రిమాండ్ చేశారు. అనంతరం జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని మళ్లీ ఒత్తిడి తెచ్చింది. లేకుంటే బ్రతకలేనంటూ తన ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు కోర్టు పరిధిలో ఉన్నందని ఆమెను సముదాయించారు.