- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ ఫుల్ కిక్కు.. నవంబర్‌లో ఆల్ టైం రికార్డు!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేళ లిక్కర్ ఏరులై పారిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందు, మాంసం, డబ్బులు పంచాయి. ఇక లిక్కర్ సేల్స్ తెలంగాణలో రికార్డు సృష్టించాయి. గతేడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో మద్యం అమ్మకాలు రూ.1260 కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో తొలి 20 రోజుల్లో రూ.1470 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. నవంబర్ నెల మొదటి 20 రోజుల్లో ఈ రేంజ్‌లో సేల్స్ ఉంటే చివరి 10 రోజుల్లో లిక్కర్ సేల్స్ అన్ని రికార్డులను బద్దలు కొడతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరో వైపు ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణలో రూ.105 కోట్ల మద్యం పట్టుబడటం గమనార్హం. గతేడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో 12.5 లక్షల కాటన్ల బీర్లు సేల్ అవ్వగా.. ఈ ఏడాది తొలి 20 రోజుల్లో 22 లక్షల కాటన్ బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈ లెక్కల దృష్ట్యా తెలంగాణలో నవంబర్ నెలలో లిక్కర్ విక్రయాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.